ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

Ministry of Housing and Urban Poverty Alleviation (MoHUPA) has introduced in June 2015, an interest subsidy scheme called Credit Linked Subsidy Scheme (CLSS) under Pradhan Mantri Awas Yojana (URBAN)-Housing for All, for purchase/ construction/ extension/ improvement of house to cater Economical Weaker Section(EWS)/Lower Income Group(LIG)/Middle Income Group (MIG), given the projected growth of urbanization & the consequent housing demands in India.

PMAY ప్రయోజనాలు

PMAY క్రింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS) వడ్డీ భాగంపై అందించిన రాయితీ హోమ్ లోన్ పైన కస్టమర్ యొక్క ఖర్చులను తగ్గిస్తున్నందు వలన హోమ్ లోన్‌ను భరించగలిగేదిగా చేస్తుంది. ఈ స్కీం కింద సబ్సిడీ మొత్తం ఎక్కువగా ఒక కస్టమర్ ఏ ఆదాయ వర్గానికి చెందుతాడో ఆ కేటగిరీ మరియు ఫైనాన్స్‌ చేయబడే ఆస్తి యూనిట్ యొక్క సైజు పైన ఆధారపడి ఉంటుంది.

ఆదాయ వర్గాల ప్రకారం ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

EWS/LIG వర్గం:

LIG మరియు EWS వర్గాలు అనేవి వారి వార్షిక గృహ ఆదాయాలు ₹ 3 లక్షలు కంటే ఎక్కువగా ఉండి కానీ ₹ 6 లక్షల కంటే తక్కువగా ఉన్నవారుగా నిర్వచించబడ్డాయి. ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) మరియు తక్కువ ఆదాయ సమూహం (LIG) వర్గాలకు చెందిన లబ్ధిదారులు 6.5%% గరిష్ట వడ్డీ రాయితీకి అర్హులై ఉంటారు, అయితే నిర్మించే లేదా కొనుగోలు చేసే యూనిట్ 60 చదరపు మీటర్ల (సుమారు 645.83 చదరపు అడుగులు) కార్పెట్ విస్తీర్ణం మించకుండా ఉండాలి. వడ్డీ రాయితీ గరిష్టంగా ₹. 6 లక్ష లోన్ మొత్తానికి పరిమితం చేయబడింది.

2017 లో మధ్య ఆదాయ సమూహాలను (MIG) చేర్చడానికి ఈ పథకం విస్తరించబడింది .ఈ పథకం రెండు భాగాలుగా విభజించబడింది, అవి MIG 1 మరియు MIG 2.

MIG 1 వర్గం:

MIG 1 వర్గం అనేది గృహ ఆదాయం ₹. 6 లక్ష కంటే ఎక్కువ, కానీ ₹. 12 లక్ష లోపు ఉన్నదిగా నిర్వచించబడింది. MIG- 1 శ్రేణిలోని లబ్ధిదారులు 4 % గరిష్ట వడ్డీ రాయితీకి అర్హులు, అయితే నిర్మించే లేదా కొనుగోలు చేసే యూనిట్ 160 చదరపు మీటర్ల (సుమారుగా 1,722.23 చదరపు అడుగులు) కార్పెట్ విస్తీర్ణత అవసరాన్ని మించకూడదు. అయితే ఈ సబ్సిడీ 20 సంవత్సరాల వరకు హోమ్ లోన్ అవధి పై గరిష్టంగా ₹. 9 లక్షల లోన్ మొత్తానికి పరిమితం చేయబడింది.

MIG 2 వర్గం:

MIG 2 వర్గం అనేది గృహ ఆదాయం ₹. 12 లక్ష కంటే ఎక్కువ, కానీ ₹. 18 లక్ష లోపు ఉన్నదిగా నిర్వచించబడింది. MIG- 2 శ్రేణిలోని లబ్ధిదారులు 3% % గరిష్ట వడ్డీ రాయితీకి అర్హులు, అయితే నిర్మించే లేదా కొనుగోలు చేసే యూనిట్ 200 చదరపు మీటర్ల (సుమారుగా 2,152.78 చదరపు అడుగులు) కార్పెట్ విస్తీర్ణత అవసరాన్ని మించకూడదు. అయితే ఈ సబ్సిడీ 20 సంవత్సరాల వరకు హోమ్ లోన్ అవధి పై గరిష్టంగా ₹. 12 లక్షల లోన్ మొత్తానికి పరిమితం చేయబడింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్హత

 1. అతని/ఆమె పేరుతో కానీ లేదా అతని/ఆమె కుటుంబంలోని ఏదైనా సభ్యుడి పేరుతో కాని భారతదేశంలోని ఏ ప్రదేశంలో కూడా పక్కా ఇల్లు ఉండకూడదు.
 2. ఒకవేళ పెళ్లి అయిన దంపతులు అయితే, వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు జాయింట్ ఓనర్షిప్ ఒక సబ్సిడీ కు మాత్రమే అర్హులు.
 3. బెనెఫిషరీ కుటుంబం గవర్నమెంట్ అఫ్ ఇండియా ఇచ్చే ఏ హౌసింగ్ స్కీం క్రింద సెంట్రల్ సహాయం లేదా పిఎమ్ఏవై ఏ స్కీం క్రింద గాని సహాయం పొంది ఉండ కూడదు.
బెనెఫిషరీ

బెనెఫిషరీ కుటుంబం అంటే భర్త, భార్య మరియు పెళ్లి కాని పిల్లలు. (పెళ్లి తో సంబంధం లేకుండా ఒక ఆదాయం సంపాదించే సభ్యుడు ఒక విడి హౌస్ హోల్డ్ క్రింద లెక్క చేయబడుతుంది MIG కేటగిరీలో)

కవరేజ్:

2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని చట్టబద్దమైన పట్టణాలు మరియు తరువాత నోటిఫై చేయబడిన పట్టణాలు, ఆ చట్టబద్దమైన పట్టణం తాలుకా ప్లానింగ్ ఏరియా.

పిఎమ్ఏవై స్కీం వివరాలు

CLSS స్కీం టైపు EWS మరియు LIG MIG 1 ** MIG 2 **
అర్హత కలిగిన హౌస్ హోల్డ్ ఆదాయం (₹.) ₹.6,00,000 వరకు ₹.6,00,001 నుండి ₹.12,00,000 వరకు ₹.12,00,001 నుండి ₹.18,00,000 వరకు
కార్పెట్ ఏరియా-గరిష్ట (స్క్వేర్ మీటర్స్) 60 స్క్వేర్ మీటర్స్ 160 స్క్వేర్ మీటర్స్ 200 స్క్వేర్ మీటర్స్
వడ్డీ సబ్సిడీ (%) 6.5% 4.00% 3.00%
సబ్సిడీ లెక్కించబడే గరిష్ట లోన్ అమౌంట్ ₹.6,00,000 ₹.9,00,000 ₹.12,00,000
లోన్ ఉద్దేశ్యము కొనుగోలు / స్వీయ నిర్మాణం / విస్తరణ కొనుగోలు/స్వీయ నిర్మాణం కొనుగోలు/స్వీయ నిర్మాణం
స్కీం యొక్క చెల్లుబాటు సమయం 31/03/2022 31/03/2020 31/03/2020
గరిష్ట సబ్సిడీ (₹.) 2.67 లక్షలు 2.35 లక్షలు 2.30 లక్షలు
మహిళా యాజమాన్యం అవును * తప్పనిసరి కాదు తప్పనిసరి కాదు

* నిర్మాణానికి / విస్తరణకు మహిళా యాజమాన్యం తప్పనిసరి కాదు

*15.03.2018 సవరణ ప్రకారం, ఆదాయం సంపాదించే సభ్యుడు (పెళ్లితో సంబంధం లేదు) ఒక విడి కుటుంబంగా లెక్కింపబడును. ఒకవేళ పెళ్లి అయిన దంపతులు అయితే, భార్య భర్తలలో ఎవరో ఒకరు గాని లేదా ఇద్దరు కలిసి జాయింట్ ఓనర్షిప్ ఒక ఇంటికి అర్హులు అవుతారు, ఈ స్కీం లో ఉన్న ఆదాయం అర్హతను బట్టి.

**MIG - 1 మరియు 2 కోసం లోన్ 1-1-2017 న కాని లేదా తరువాత కాని అప్రూవ్ చేసి ఉండవలెను

 1. MIG వర్గానికి బెనెఫిషరీ కుటుంబం యొక్క ఆధార్ నెంబర్(లు) తప్పని సరి.
 2. వడ్డీ సబ్సిడీ 20 సంవత్సరములు లోన్ లేదా లోన్ పీరియడ్ ఏది తక్కువ అయితే దానికి లభ్యం.
 3. వడ్డీ సబ్సిడీ నేరుగా లోన్ అకౌంట్ కు క్రెడిట్ చేయబడును హెచ్ డి ఎఫ్ సి ద్వారా, దీనివలన హోసింగ్ లోన్ అమౌంట్ మరియు మరియు ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) తగ్గుతుంది.
 4. వడ్డీ సబ్సిడీ యొక్క నెట్ ప్రెజెంట్ వేల్యూ (NPV) 9% డిస్కౌంట్ రేట్ లో లెక్కింపబడును.
 5. పేర్కొన్న పరిమితి కన్నా లోన్ ఎక్కువ అయితే, ఆ అమౌంట్ సబ్సిడైజ్డ్ కాని రేట్ లో ఉండును.
 6. లోన్ అమౌంట్ మీద కాని ఆస్తి విలువ మీద కాని ఎటువంటి పరిమితి లేదు.

*ఈ స్కీం యొక్క మరిన్ని వివరాలకు దయచేసి ఇక్కడ చూడండి www.mhupa.gov.in

గమనిక: CLSS యొక్క ప్రయోజనాలను పొందేందుకు మీ అర్హతను అంచనా వేయడం భారత ప్రభుత్వ ఏకైక అభీష్టానుసారం ఉంటుంది. ఈ స్కీం ప్రయోజనాలను పొందేందుకు అర్హతను అంచనా వేసే పద్ధతి ఇక్కడ ఇవ్వబడింది.

 

క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సిఎల్ఎస్ఎస్) కింద పిఎంఎవై సబ్సిడీని ఎవరు పొందవచ్చు?(CLSS)?

ఆ కుటుంబం కోసం నిర్వచించిన ఆదాయం బట్టి, భారతదేశంలో ఏ ప్రదేశంలో కూడా సొంత ఇల్లు లేని లబ్దిదారుని కుటుంబం ఈ సబ్సిడీ కు అర్హులు.

బెనెఫిషరీ కుటుంబం యొక్క నిర్వచనం ఏమిటి?

బెనెఫిషరీ కుటుంబం అంటే భర్త, భార్య మరియు పెళ్లి కాని పిల్లలు. (పెళ్లి తో సంబంధం లేకుండా ఒక ఆదాయం సంపాదించే సభ్యుడు ఒక విడి హౌస్ హోల్డ్ క్రింద లెక్క చేయబడుతుంది MIG కేటగిరీలో)

EWS, LIG మరియు MIG వర్గాల ఆదాయం నిబంధనలు ఏమిటి?

దయచేసి పైన సూచించిన స్కీం వివరాలు చూడండి.

ఇది గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులకు వర్తిస్తుందా?

కాదు.

పిఎంఎవై సబ్సిడీకి అర్హత పొందడానికి మహిళా యాజమాన్యం తప్పనిసరా?

EWS మరియు LIG లకు మహిళల యాజమాన్యం లేదా సహ- యాజమాన్యం తప్పనిసరి. అయితే, స్వయం నిర్మాణం/విస్తరణలకు లేదా MIG వర్గాలకు తప్పనిసరి కాదు.

వడ్డీ సబ్సిడీ పొందే విధానం ఏమిటి?

లోన్ డిస్బర్స్ చేసిన తరువాత, డేటా ధ్రువీకరణ మరియు తనిఖీ కొరకు హెచ్ డి ఎఫ్ సి కావలసిన వివరాలను ఎన్‍హెచ్‍బి కు పంపును. ఎన్‍హెచ్‍బి అవసరమైన తనిఖీలు చేసిన తరువాత అర్హత కలిగిన ఋణ గ్రహీతలకు సబ్సిడీ అప్రూవ్ చేయును.

వడ్డీ సబ్సిడీ ప్రయోజనం నేను ఎలా అందుకోగలను?

 1. లోన్ డిస్బర్స్ చేసిన తరువాత, హెచ్ డి ఎఫ్ సి అర్హత గల ఋణ గ్రహీతలకు సబ్సిడీ ను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‍హెచ్‍బి) నుండి క్లెయిమ్ చేయును.
 2. ఎన్‍హెచ్‍బి అవసరమైన తనిఖీలు చేసిన తరువాత అర్హత గల ఋణ గ్రహీతలకు సబ్సిడీ అప్రూవ్ చేసి హెచ్ డి ఎఫ్ సి కు ఆ అమౌంట్ ను క్రెడిట్ చేయును.
 3. సబ్సిడీ ఎన్ పి వి (నెట్ ప్రెసెంట్ వేల్యూ) పధ్ధతి ద్వారా 9శాతం డిస్కౌంట్ లో లెక్కింపబడును.
 4. ఎన్‍హెచ్‍బి నుండి సబ్సిడీ అమౌంట్ అందుకున్న తరువాత, అది ఋణ గ్రహీతల యొక్క లోన్ అకౌంట్ కు క్రెడిట్ చేయబడును మరియు EMI ఆ నిష్పత్తి లో తగ్గించబడును.

పిఎంఎవై సబ్సిడీ పంపిణీ చేయబడి, కానీ కొన్ని కారణాల వల్ల, ఇంటి నిర్మాణం నిలిచిపోయినప్పుడు ఏం జరుగుతుంది?

అటువంటప్పుడు, సబ్సిడీ ఋణ గ్రహీత నుండి రికవర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు రిఫండ్ చేయబడును.

బెనెఫిషరీ కుటుంబం లోన్ నిర్ణీత కాలం 20 సంవత్సరములకు పైగా ఉండే లోన్ తీసుకొనవచ్చునా?

అవును, బెనెఫిషరీ లోన్ నిర్ణీత కాలం 20 సంవత్సరములకు పైగా ఉండే లోన్ తీసుకొనవచ్చును కానీ సబ్సిడీ 20 సంవత్సరముల వరకే పరిమితం.

లోన్ అమౌంట్ మీద కాని లేదా ఆస్తి విలువ మీద కానీ ఏదైనా లిమిట్ ఉందా?

లేదు, కాని సబ్సిడీ ప్రతి కేటగిరీ కు తెలియచేసిన లోన్ అమౌంట్ పైన మాత్రమే వచ్చును మరియు మిగతా అమౌంట్ కు నాన్-సబ్సిడైజ్డ్ వడ్డీ రేటు వర్తించును.

ఒకవేళ నా హోమ్ లోన్ ఇంకొక లెండర్ కు బదిలీ చేసినచో వడ్డీ సబ్సిడీ ఎలా పనిచేస్తుంది?

ఒకవేళ హౌసింగ్ లోన్ తీసుకున్న ఋణ గ్రహీత ఈ స్కీం క్రింద వడ్డీ సబ్సిడీ పొంది ఆ తరువాత లోన్ బ్యాలెన్స్ ఇంకొక లెండింగ్ సంస్థకు బదిలీ చేసుకుంటే, అటువంటి ప్రయోజనాలు ఈ స్కీం క్రింద తిరిగి పొందుటకు అర్హులు కారు.

క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం (సిఎల్ఎస్ఎస్) కు నేను ఎక్కడ అప్లై చేయగలను?

సిఎల్ఎస్ఎస్ క్రింద హౌసింగ్ లోన్ కు మీరు ఏ హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ లోనైనా అప్లై చేయవచ్చును.

పిఎంఎవై సబ్సిడీ పొందటానికి నేను ఏదైనా అదనపు డాక్యుమెంట్లు ఇవ్వవలసి ఉంటుందా?

లేదు, అదనపు డాక్యుమెంట్లు ఏమి లేవు, మీకు సొంతమైన పక్కా ఇల్లు లేదని ఒక స్వీయ ప్రకటన ఇవ్వవలెను హెచ్ డి ఎఫ్ సి ఆఫీసులలో లభ్యమయ్యే ఫార్మాట్ లో.

పిఎంఎవై సబ్సిడీని ఎన్ఆర్ఐ పొందవచ్చా?

అవును.

సంభాషించుకుందాం!