హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15
25,00,000
25,56,046
50,56,046

ఈ క్యాలిక్యులేటర్లు సాధారణ స్వీయ-సహాయక ప్రణాళికా సాధనాలుగా మాత్రమే అందించబడినవి. వీటి ఫలితాలు, మీరు అందించే అంచనాలతో సహా అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వాటి ఖచ్ఛితత్వము లేదా మీ పరిస్థితులకు అనువర్తనము గురించి కాని మేము హామీ ఇవ్వలేము.
NRIలు నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

హెచ్ డి ఎఫ్ సి యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ Emi ను సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడుతుంది. హోమ్ లోన్ కోసం హెచ్ డి ఎఫ్ సి యొక్క EMI కాలిక్యులేటర్ మీకు ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ EMI కాలిక్యులేటర్ మీ హోమ్ లోన్‌ కోసం మీ క్యాష్ ఫ్లోలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగకరం.ప్రతి లక్షకు ₹741 నుండి ప్రారంభమయ్యే EMI లు మరియు సంవత్సరానికి 8.10%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రి‌పేమెంట్ ఆప్షన్లు మరియు టాప్-అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది. తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాలిక రిపేమెంట్ అవధితో, హెచ్ డి ఎఫ్ సి మీరు సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI పొందేటట్లు చేస్తుంది. మా సహేతుకమైన EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. మా సులభమైన హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో మీరు మీ హోమ్ లోన్ కోసం చెల్లించవలసిన EMI ను లెక్కించుకోండి.

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ లోన్ ఇన్స్టాల్‌మెంట్లు లెక్కించడంలో సహాయపడుతుంది. మీ హోమ్ లోన్‌కు EMI. ఇది సులభంగా ఉపయోగించగల కాలిక్యులేటర్‌ మరియు ఇంటి కొనుగోలుదారుకు ఆర్థిక ప్రణాళిక సాధనంగా పనిచేస్తుంది.

హోమ్ లోన్ EMI అంటే ఏమిటి??

EMI అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్‌మెంట్. ఇందులో ప్రధాన మొత్తము తిరిగిచెల్లింపు మరియు బకాయి ఉన్న మీ హోమ్ లోన్ పై వడ్డీ చెల్లింపు ఉంటాయి. దీర్ఘకాలిక లోన్ కాలపరిమితి (గరిష్ఠంగా 30 సంవత్సరాల కాలానికి) EMI తగ్గించుకోవటంలో సహాయపడుతుంది.

వివరణ: లోన్ పై EMI ఎలా లెక్కించబడుతుంది?

EMI లెక్కింపు కోసం ఫార్ములా -

P x R x (1+R)^N / [(1+R)^N-1] ఇక్కడ-

P = ప్రిన్సిపల్ లోన్ మొత్తం

N = నెలల్లో లోన్ అవధి

R = నెలవారీ వడ్డీ రేటు

మీ లోన్ పై వడ్డీ రేటు (R) నెలకు లెక్కించబడుతుంది.

R = వార్షిక వడ్డీ రేటు/12/100

ఒక సంవత్సరానికి వడ్డీ రేటు 7.2% అయితే, అప్పుడు ₹ = 7.2/12/100 = 0.006

ఉదాహరణకు, ఒక వ్యక్తి 120 నెలలు (10 సంవత్సరాలు) అవధి కోసం 7.2% వార్షిక వడ్డీ రేటు వద్ద ₹10,00,000 లోన్ పొందినట్లయితే, అప్పుడు అతని EMI ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది:

EMI= ₹10,00,000 * 0.006 * (1 + 0.006)120 / ((1 + 0.006)120 - 1) = ₹11,714.

చెల్లించవలసిన మొత్తం ₹11,714 * 120 = ₹14,05,703 అసలు లోన్ మొత్తం ₹10,00,000 మరియు వడ్డీ మొత్తం ₹4,05,703 ఉంటుంది

ఫార్ములా ఉపయోగించి మాన్యువల్‌గా EMI లెక్కించడం అనేది కష్టతరంగా ఉండవచ్చు.

హెచ్ డి ఎఫ్ సి యొక్క EMI క్యాలిక్యులేటర్ మీ లోన్ EMI ను సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడగలదు.

EMI లెక్కింపు ఇంటి కొనుగోలు పణాళికలో ఏ విధంగా సహాయపడుతుంది?

హెచ్ డి ఎఫ్ సి వారి హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ EMI ల రూపములో చెల్లించవలసిన మొత్తము గురించి ఒక అవగాహనను ఇస్తుంది మరియు ప్రతి నెల హౌసింగ్ లోన్ కు చెల్లించబడే అవుట్‍ఫ్లో గురించి తెలిసిన నిర్ణయాన్ని తీసుకొనుటలో సహాయపడుతుంది. ఇది తీసుకోవలసిన ఋణమును అంచనావేయుటలో సహాయపడుతుంది మరియు సొంత కాంట్రిబ్యూషన్ ఆవశ్యకతలను మరియు ఆస్తి ధరను అంచనావేయుటకు సహాయపడుతుంది. అందుచేత EMI గురించి తెలుసుకొనుట హోమ్ లోన్ అర్హత లెక్కింపులో మరియు ఇంటిని కొనుగోలు చేసే మీ ప్రయాణాన్ని మెరుగుగా ప్రణాళిక చేసుకోవటంలో చాలా కీలకమైనది.

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ల యొక్క ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏమిటి?

 • ఫ్లాట్, రో హౌస్, బంగళా ప్రైవేట్ డెవలపర్స్ దగ్గర నుండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో కొనుగోలు చేయుటకు హోమ్ లోన్లు

 • DDA, MHADA, మొదలగు డెవలప్‍మెంట్ అథారిటీల నుండి కొనుగోలు చేసే ఆస్తులకు హోమ్ లోన్లు

 • ప్రస్తుతం ఉన్న కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ సెటిల్మెంట్స్ లేదా ప్రైవేట్ గా కట్టిన ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు

 • ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ ప్లాట్ పైన లేదా డెవలప్మెంట్ అథారిటీ అలాట్ చేసిన ప్లాట్ పైన నిర్మాణానికి లోన్లు

 • మీరు సరైన గృహ కొనుగోలు నిర్ణయము తీసుకొనుటలో సహాయపడుటకు నిపుణులచే చట్టపరమైన మరియు సాంకేతిక కౌన్సిలింగ్

 • ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్ ద్వారా భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు తీసుకొనవచ్చును మరియు లోన్లు సర్వీస్ చేయబడును

 • భారత సైన్యంలో పనిచేసేవారికి హోమ్ లోన్ల కోసం AGIF తో ప్రత్యేక ఏర్పాట్లు.

మా హోం లోన్స్ అన్ని వయస్సుల వారికీ మరియు అన్నీ రకాల వృత్తుల వారి అవసరాలకి తగినట్లుగా రూపొందించబడింది. మేము సర్దుబాటు చేయదగిన రేట్ ఆప్షన్ క్రింద 30 సంవత్సరాల వరకు దీర్ఘకాల అవధి, టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ అందిస్తాము, దీని వలన యువ కస్టమర్లు తమ జీవితాలలో త్వరగా ఇంటి యాజమానులు అయ్యే విధంగా సహకరిస్తుంది.

4 దశాబ్దాలుగా హోమ్ ఫైనాన్స్‌ను అందించిన మా అనుభవంతో, మేము మా కస్టమర్ల యొక్క విభిన్న అవసరాలను అర్థం చేసుకోగలుగుతాము మరియు ఇంటిని సొంతం చేసుకోవాలనే వారి కలను నెరవేరుస్తాము .

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ EMI లోన్ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

మీ EMI తెలుసుకొనుటకు ఈ క్రింది వాటిని ఇన్పుట్ చేయాలి:

 • ఋణము మొత్తము: మీరు తీసుకోవాలని అనుకుంటున్న ఋణము మొత్తాన్ని ఇన్పుట్ చేయండి
 • లోన్ వ్యవధి (సంవత్సరాలలో): మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్న లోన్ కాలపరిమితిని ఇన్పుట్ చేయండి. దీర్ఘకాలికమైన కాలపరిమితి అర్హతను పెంచడంలో సహాయపడుతుంది
 • వడ్డీ రేటు (% సంవత్సరానికి.): వడ్డీ రేటును ఇన్పుట్ చేయండి.

ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లను తెలుసుకోవడానికి 'ఇక్కడ క్లిక్ చేయండి

హోమ్ లోన్ ఋణవిమోచన షెడ్యూల్ అంటే ఏమిటి?

ఋణవిమోచన అంటే లోన్ వ్యవధిలో సాధారణ చెల్లింపులతో లోన్‌ను తగ్గించే ప్రాసెస్. హోమ్ లోన్ ఋణవిమోచన షెడ్యూల్ అనేది తిరిగి చెల్లించే మొత్తం, ప్రధాన మరియు వడ్డీ భాగం యొక్క వివరాలను ఇచ్చే ఒక టేబుల్.

హెచ్ డి ఎఫ్ సి యొక్క EMI కాలిక్యులేటర్లు లోన్ అవధి మరియు వడ్డీ రేట్ల ఆధారంగా వడ్డీకి అసలు మొత్తం నిష్పత్తి గురించి సరైన అవగాహన ఇస్తాయి. EMI కాలిక్యులేటర్ రీపేమెంట్ షెడ్యూల్‌ను వివరించే ఋణవిమోచన షెడ్యూల్ టేబుల్‌ను కూడా అందిస్తుంది. హెచ్ డి ఎఫ్ సి యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ వడ్డీ మరియు అసలు మొత్తం యొక్క పూర్తి వివరణను ఇస్తుంది.

హెచ్‌ డి ఎఫ్‌ సి హోమ్ లోన్ అర్హతను పెంచే వివిధ రీపేమెంట్ ఆప్షన్లను అందిస్తుంది:

భిన్నమైన అవసరాలకు తగిన విధంగా హోమ్ లోన్ అర్హత ను అర్హతను గరిష్టంగా పెంచుకోవడానికి హెచ్ డి ఎఫ్ సి అనేక రీ పేమెంట్ ప్లాన్లను అందిస్తుంది.

 • స్టెప్ అప్ రీ పేమెంట్ సదుపాయం (SURF)

SURF ఆప్షన్ ద్వారా మీ రీపేమెంట్ షెడ్యూల్ ను మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో లింక్ చేసుకొనవచ్చును. మీరు పెద్ద లోన్ అమౌంట్ తీసుకుని ప్రారంభ సంవత్సరాలలో తక్కువ EMI లు చెల్లించవచ్చును. తరువాత, మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో సమానంగా ఉండేటట్లు రీపేమెంట్ అమౌంట్ ను పెంచుకోవచ్చును.

 • అనువైన లోన్ ఇన్స్టాల్మెంట్ల ప్లాన్ (FLIP)

FLIP మీ రీ పేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మీకు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాలలో EMI ఎక్కువ ఉండేటట్లు తరువాత మీ ఆదాయంతో సమానంగా తగ్గేటట్లు లోన్ నిర్మాణం చేసుకొనవచ్చును.

 • వాయిదా ఆధారిత EMI

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.

 • వేగవంతమైన రీపేమెంట్ స్కీమ్

ఈ ఆప్షన్ లో మీరు ప్రతి సంవత్సరము మీ ఆదాయం తో సరిసమానంగా EMI లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు లోన్ ను తొందరగా రీపేమెంట్ చేయవచ్చును.

 • టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్

ఈ ఆప్షన్ లో మీరు ఎక్కువ రీ పేమెంట్ కాలాన్ని 30 సంవత్సరముల వరకు ఎంచుకొనవచ్చును. అంటే ఎక్కువ లోన్ అమౌంట్ మరియు తక్కువ ఈ ఎం ఐ లు.

అనేక విశేషతలు ఉన్న మా EMI క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ హౌసింగ్ లోన్ యొక్క EMI లను అంచనా వేయండి, ఇప్పుడే!

క్యాలిక్యులేటర్ ఉపయోగించి EMI యొక్క అంచనా పొందిన తరువాత, మీరు మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా హెచ్ డి ఎఫ్ సి వారి ఆన్లైన్ హోమ్ లోన్స్ తో ఆన్లైన్ లో హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేయవచ్చు.

ముందుగా ఆమోదించబడిన హోమ్ లోన్ అంటే ఏమిటి?

మీ కలల ఇంటిని మీరు గుర్తించక ముందే హెచ్ డి ఎఫ్ సి ముందే ఆమోదించబడిన హోమ్ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఒక ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ అనేది మీ ఆదాయం, క్రెడిట్ యోగ్యత మరియు ఆర్థిక స్థితి ఆధారంగా ఇవ్వబడిన లోన్ కోసం ఒక ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్.

హెచ్ డి ఎఫ్ సి తో ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేయండి, ఆన్‌లైన్‌లో అప్లై చేయండి ని క్లిక్ చేయండి

ఒకవేళ మేము మీతో సంప్రదిస్తూ ఉండాలని మీరు కోరుకుంటే, దయచేసి మీ వివరాలను మాకు ఇవ్వండి.

ఇక్కడ క్లిక్ చేయండి హోమ్ లోన్ల గురించి మరింత తెలుసుకోవడానికి.

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,52,8022,00,59052,21224,47,788
224,47,7882,52,8021,96,20056,60223,91,185
323,91,1852,52,8021,91,44161,36123,29,824
423,29,8242,52,8021,86,28266,52022,63,304
522,63,3042,52,8021,80,68972,11321,91,191
621,91,1912,52,8021,74,62778,17621,13,015
721,13,0152,52,8021,68,05484,74820,28,267
820,28,2672,52,8021,60,92991,87419,36,393
919,36,3932,52,8021,53,20499,59818,36,795
1018,36,7952,52,8021,44,8301,07,97217,28,823
1117,28,8232,52,8021,35,7531,17,05016,11,773
1216,11,7732,52,8021,25,9111,26,89114,84,883
1314,84,8832,52,8021,15,2431,37,55913,47,323
1413,47,3232,52,8021,03,6781,49,12511,98,199
1511,98,1992,52,80291,1401,61,66210,36,536
1610,36,5362,52,80277,5481,75,2548,61,282
178,61,2822,52,80262,8131,89,9896,71,293
186,71,2932,52,80246,8402,05,9624,65,330
194,65,3302,52,80229,5232,23,2792,42,051
202,42,0512,52,80210,7512,42,0510

హోమ్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్" మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన కట్టే అమౌంట్. EMI లో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాలలో వడ్డీ భాగం ఎక్కువగా ఉండును, మరియు లోన్ కాలపు రెండవ భాగంలో అసలు భాగం ఎక్కువ ఉండేటట్లు లోన్ నిర్మాణం చేయబడును.

లోన్ పంపిణీ చేయబడిన నెల తరువాత నెల నుండి EMI ప్రారంభమవుతుంది. నిర్మాణంలో ఉన్న ఆస్తుల కోసం లోన్లపై EMI సాధారణంగా పూర్తి హోమ్ లోన్ పంపిణీ చేయబడిన తర్వాత ప్రారంభమవుతుంది కానీ కస్టమర్లు తమ మొదటి పంపిణీ పొందిన వెంటనే తమ EMIలను ప్రారంభించడానికి ఎంచుకోవచ్చు మరియు ప్రతి తరువాతి పంపిణీకి తగినట్లుగా వారి EMIలు తదనుగుణంగా పెరుగుతాయి. రీసేల్ కేసుల కోసం, పూర్తి లోన్ మొత్తం ఒకేసారి పంపిణీ చేయబడుతుంది కాబట్టి, పూర్తి లోన్ మొత్తంపై EMI పంపిణీ నెల తరువాత ప్రారంభం అవుతుంది

ఒక హోమ్ లోన్ కోసం EMI క్యాలిక్యులేటర్ యొక్క ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి-

మీ ఫైనాన్సులను ముందుగానే ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది

ఒక EMI క్యాలిక్యులేటర్ అనేది మీ క్యాష్ ఫ్లో ను ముందుగానే ప్లాన్ చేయడానికి ఉపయోగపడుతుంది, తద్వారా మీరు ఒక హోమ్ లోన్ పొందేటప్పుడు మీ హోమ్ లోన్ చెల్లింపులను సులభంగా చేసుకోవచ్చు. మరోమాటలో, EMI క్యాలిక్యులేటర్ అనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు లోన్ సర్వీసింగ్ అవసరాలకు ఒక ఉపయోగకరమైన సాధనం.

ఉపయోగించడానికి సులభం

EMI క్యాలిక్యులేటర్లు చాలా సాధారణంగా ఉంటాయి మరియు ఉపయోగించడానికి సులభం. మీరు మూడు ఇన్‌పుట్ విలువలను మాత్రమే అందించవలసి ఉంటుంది:

a. లోన్ మొత్తం
b. వడ్డీ రేటు
c. అవధి

ఈ మూడు ఇన్‌పుట్ విలువల ఆధారంగా, EMI క్యాలిక్యులేటర్ మీరు ప్రతి నెలా హోమ్ లోన్ ప్రొవైడర్‌కు చెల్లించవలసిన వాయిదాను లెక్కిస్తుంది. కొన్ని EMI క్యాలిక్యులేటర్లు హోమ్ లోన్ కోసం మీరు మొత్తం లోన్ అవధిలో చెల్లించే వడ్డీ మరియు ప్రిన్సిపల్ మొత్తం యొక్క వివరణాత్మక వివరణను కూడా అందిస్తాయి.

ఆస్తి శోధనపై దృష్టి సారించడానికి సహాయపడుతుంది

EMI క్యాలిక్యులేటర్ మీ నెలవారీ బడ్జెట్‌కు సరిపోయే సరైన హోమ్ లోన్ మొత్తాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది, మీ ఫైనాన్షియల్ స్థితికి సరిపోయే లోన్ EMI మరియు అవధిని నిర్ణయించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ ఆస్తి శోధనపై మరింత దృష్టి సారించడానికి సహాయపడుతుంది.

సులభంగా యాక్సెస్ చేయదగినది

ఆన్‌లైన్‌లో EMI క్యాలిక్యులేటర్‌ను ఎక్కడినుండైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. సరైన హోమ్ లోన్ మొత్తం, EMI లు మరియు మీ అవసరాలకు సరిపోయే అవధిని చేరుకోవడానికి మీరు అవసరమైనన్ని సార్లు ఇన్‌పుట్ వేరియబుల్ యొక్క వివిధ కాంబినేషన్లను ప్రయత్నించవచ్చు.

మీరు హోమ్ లోన్ పొందవచ్చు మరియు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, జైపూర్ మరియు మరిన్ని నగరాల్లో మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు.

ప్రీ-EMI అంటే మీ హోమ్ లోన్‌పై నెలవారీ వడ్డీ చెల్లింపు. లోన్‌ను పూర్తిగా పంపిణీ చేసే వరకు ఈ మొత్తం చెల్లించబడుతుంది. మీ వాస్తవ లోన్ అవధి - మరియు EMI (ప్రిన్సిపల్ మరియు వడ్డీ రెండింటినీ కలిగి ఉంటుంది) చెల్లింపులు - ప్రీ-EMI దశ ముగిసిన తర్వాత అంటే లోన్ పూర్తిగా పంపిణీ చేయబడిన తర్వాత ప్రారంభమవుతాయి.

అవును. మీ సమీప హెచ్ డి ఎఫ్ సి శాఖను సందర్శించడం ద్వారా మీరు అలా చేయవచ్చు.

హోమ్ లోన్ సాధారణంగా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI) ద్వారా తిరిగి చెల్లించబడుతుంది. EMI లో ప్రిన్సిపల్ మరియు వడ్డీ కాంపొనెంట్లు ఉంటాయి, మీ లోన్ యొక్క ప్రారంభ సంవత్సరాలలో, వడ్డీ కాంపొనెంట్ ప్రిన్సిపల్ కాంపొనెంట్ కంటే ఎక్కువగా ఉండే విధంగా మరియు లోన్ యొక్క తరువాతి కాలంలో ప్రిన్సిపల్ కాంపొనెంట్ అధికంగా ఉండే విధంగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.

మీ సౌలభ్యం కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం హెచ్డిఎఫ్సి వివిధ పధ్ధతులను అందిస్తుంది. భారతదేశంలో మీ నాన్-రెసిడెంట్ (బాహ్య) అకౌంట్ / నాన్-రెసిడెంట్ (సాధారణ) అకౌంట్ నుండి ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా ఇన్స్టాల్మెంట్లను చెల్లించడానికి మీరు పోస్ట్-డేటెడ్ చెక్కులు లేదా మీ బ్యాంకుకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయవచ్చు. నగదు చెల్లింపులు అంగీకరించబడవు.

ఆలస్యం చేయబడిన చెల్లింపుల కోసం జరిమానా మరియు చెక్ బౌన్స్ ఛార్జీల పై వివరాల కోసం, దయచేసి మా నిర్దిష్ట ప్రాడక్ట్ పేజీలలోని సమాచారాన్ని చూడండి

ఒక డెవలపర్ నుండి ఒక నిర్మాణంలో ఉన్న లేదా సిద్ధంగా ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడానికి, రీసేల్ ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి, ఒక ప్లాట్‌లో ఒక హౌసింగ్ యూనిట్ నిర్మించడానికి, ఇప్పటికే ఉన్న ఇంటికి మెరుగులు దిద్దడం మరియు విస్తరించడానికి మరియు ఒక ఆర్థిక సంస్థ నుండి మీ ప్రస్తుత హోమ్ లోన్ ను హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేయడానికి హోమ్ లోన్లు తీసుకోబడతాయి. హోమ్ లోన్ అంటే ఏమిటి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సౌకర్యం, వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, కస్టమైజ్ చేయబడిన రీపేమెంట్ ఎంపికలు మరియు సులభమైన మరియు అవాంతరాలు లేని డాక్యుమెంటేషన్ వంటి అనేక ప్రయోజనాలను హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అందిస్తుంది.

లోన్ మొత్తం ఆధారంగా మీరు మొత్తం ఆస్తి ఖర్చులో 'మీ వంతుగా 10-25% చెల్లించవలసి ఉంటుంది. ఆస్తి ఖర్చులో 75 నుండి 90% వరకు హౌసింగ్ లోన్ గా పొందవచ్చు. నిర్మాణం, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ మరియు హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ల విషయంలో, నిర్మాణం/మెరుగుదల/విస్తరణ అంచనాలో 75 నుండి 90% వరకు నిధులు అందించబడవచ్చు.

మీరు 4 వేగవంతమైన మరియు సులభమైన దశలలో ఆన్‌లైన్‌లో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ పొందవచ్చు:
1. సైన్ అప్ / రిజిస్టర్ చేయండి
2. హోమ్ లోన్ అప్లికేషన్ ఫారం నింపండి
3. డాక్యుమెంట్లను అప్‌‌లోడ్ చేయండి
4. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి
5. లోన్ అప్రూవల్ పొందండి

మీరు ఆన్‌లైన్‌లో ఒక హోమ్ లోన్ కోసం కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడే అప్లై చేయడానికి https://portal.hdfc.com/ ను సందర్శించండి!.

హెచ్ డి ఎఫ్ సి మీ హోమ్ లోన్ అర్హతను ఎక్కువగా మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ద్వారా నిర్ణయిస్తుంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు మరియు బాధ్యతలు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.

మీరు ఒక ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు, ఇది మీ ఆదాయం, క్రెడిట్ యోగ్యత మరియు ఆర్థిక స్థితి ఆధారంగా ఇవ్వబడే ఒక లోన్ కోసం ఒక ఇన్-ప్రిన్సిపల్ ఆమోదం.. సాధారణంగా, ప్రీ-అప్రూవ్డ్ లోన్లు ఆస్తి ఎంపికకు ముందు తీసుకోబడతాయి మరియు లోన్ శాంక్షన్ తేదీ నుండి 6 నెలల కాలానికి చెల్లుతాయి.

నిర్మాణంలో ఉన్న ఆస్తుల కోసం లోన్లను హెచ్‌ డి ఎఫ్‌ సి నిర్మాణం యొక్క పురోగతి ఆధారంగా వాయిదాల్లో పంపిణీ చేస్తుంది. పంపిణీ చేయబడిన ప్రతి వాయిదాను ఒక 'పాక్షిక' లేదా 'తదుపరి' పంపిణీ అని పిలుస్తారు.

ఈ క్రింది రకాల హోమ్ లోన్లు ఉత్పత్తులు సాధారణంగా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ద్వారా భారతదేశంలో అందించబడతాయి:

హోమ్ లోన్స్

ఇవి వీటి కోసం పొందిన లోన్లు:

1. ఆమోదించబడిన ప్రాజెక్టుల్లో ప్రైవేట్ డెవలపర్ల నుండి ఫ్లాట్, రో హౌస్, బంగ్లా కొనుగోలు కోసం;

2.DDA, MHADA అలాగే ఇప్పటికే ఉన్న కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు, అపార్ట్‌మెంట్ యజమానుల సంఘం లేదా డెవలప్‌మెంట్ అధికారుల సెటిల్‌మెంట్లు వంటి డెవలప్‍మెంట్ అథారిటీల నుండి ప్రాపర్టీల లేదా ప్రైవేటుగా నిర్మించిన గృహాల కొనుగోలు కోసం హోమ్ లోన్లు;

3.ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ ప్లాట్ పైన లేదా డెవలప్‍మెంట్ అథారిటీ కేటాయించిన ప్లాట్ పైన నిర్మాణానికి లోన్లు

ప్లాట్ కొనుగోలు లోన్

ప్లాట్ కొనుగోలు లోన్‌లు నేరుగా కేటాయింపు లేదా రెండవ విక్రయ లావాదేవీ ద్వారా ప్లాట్‌ను కొనుగోలు చేయడానికి అలాగే మరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ ప్రస్తుత ప్లాట్ కొనుగోలు లోన్‌ను బదిలీ చేయడానికి అందుబాటులో ఉంటాయి.

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్

మరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ బాకీ ఉన్న హోమ్ లోన్‌ను హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేయడాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్ అంటారు.

ఇంటి పునరుద్ధరణ లోన్లు

హౌస్ రేనోవేషన్ లోన్ అనేది మీ ఇంటిని టైలింగ్, ఫ్లోరింగ్, అంతర్గత / బాహ్య ప్లాస్టర్ మరియు పెయింటింగ్ మొదలైన మార్గాల్లో రెనోవేట్ (నిర్మాణం/కార్పెట్ ఏరియా మార్చకుండా) చేయడం.

హోమ్ ఎక్స్టెన్షన్ లోన్

ఇది మీ ఇంటిని విస్తరించడానికి లేదా అదనపు గదులు మరియు అంతస్తులు మొదలైనటువంటి స్థలాన్ని జోడించడానికి ఒక లోన్.