ఈ క్యాలిక్యులేటర్లు సాధారణ స్వీయ-సహాయక ప్రణాళికా సాధనాలుగా మాత్రమే అందించబడినవి. వీటి ఫలితాలు, మీరు అందించే అంచనాలతో సహా అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వాటి ఖచ్ఛితత్వము లేదా మీ పరిస్థితులకు అనువర్తనము గురించి కాని మేము హామీ ఇవ్వలేము.
NRI నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.
ఇంటి లోన్ అర్హత అంటే ఏంటి?
హోమ్ లోన్ అర్హత అనేది కొన్ని ప్రమాణాల ఆధారంగా నిర్వచించబడుతుంది, దీనిలో ఒక నిర్దిష్ట లోన్ మొత్తాన్ని పొందటానికి మరియు తిరిగి చెల్లించడానికి కస్టమర్‌కు కల క్రెడిట్ విలువను ఆర్థిక సంస్థ అంచనా వేస్తుంది. హోమ్ లోన్ అర్హత వయస్సు, ఆర్థిక స్థితి, క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఇతర ఆర్థిక బాధ్యతలు మొదలైన ప్రమాణాల పైన ఆధారపడి ఉంటుంది.
వివరణ: నేను ఎంత రుణం పొందగలను?
ఉదాహరణకు ఒక వ్యక్తి వయస్సు 30 సంవత్సరాలు మరియు ₹. 30,000 నెలవారీ గ్రాస్ శాలరీ కలిగి ఉంటే, అతనికి పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ మొదలైనటువంటి ఇతర ప్రస్తుత ఆర్థిక బాధ్యతలు ఏమీ లేకపోతే అతను 30 సంవత్సరాల అవధి కోసం 6.90% వడ్డీ రేటుకు ₹.20.49 లక్షల లోన్ పొందవచ్చు.
హోమ్ లోన్ అర్హత ఎలా లెక్కించబడుతుంది?
హోమ్ లోన్ అర్హత అనేది ప్రాథమికంగా ఆ వ్యక్తి (లు) యొక్క ఆదాయము మరియు తిరిగి చెల్లించే సామర్థ్యముపై ఆధారపడి ఉంటుంది. హోమ్ లోన్ల అర్హతను నిర్ణయించే వయసు, ఆర్థిక స్థితి, క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోర్, ఇతర ఆర్థిక బాధ్యతలు మొదలైన ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
హోమ్ లోన్ కు కావలసిన అర్హత
- ప్రస్తుత వయసు మరియు మిగిలిన పని సంవత్సరాలు: దరఖాస్తుదారుని వయసు హోమ్ లోన్ అర్హతను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. లోన్ యొక్క గరిష్ఠ కాలపరిమితి సాధారణంగా 30 సంవత్సరాలు ఉంటుంది.
- జీతం పొందుతున్న వ్యక్తుల వయో పరిమితి- 21 నుండి 65 సంవత్సరాలు .
- స్వయం - ఉపాధి పొందుతున్న వ్యక్తుల వయో పరిమితి- 21 నుండి 65 సంవత్సరాలు.
- కనీస జీతం- నెలకి ₹ 10,000.
- కనీస వ్యాపార ఆదాయం: సంవత్సరానికి ₹ 2 లక్షలు.
- గరిష్ఠ లోన్ వ్యవధి- 30 సంవత్సరాలు.
- ఆర్థిక స్థితి: హోమ్ లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో దరఖాస్తుదారుడు (లు) యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ ఆదాయము ప్రముఖమైన ప్రభావాన్ని చూపుతుంది.
- గత మరియు ప్రస్తుత క్రెడిట్ చరిత్ర మరియు క్రెడిట్ స్కోర్: మచ్చలేని రీపేమెంట్ రికార్డు సానుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
- ఇతర ఆర్థిక బాధ్యతలు: కార్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ మొదలైన ప్రస్తుత లోన్లు.
హోమ్ లోన్ అర్హతను ఎలా పెంచుకోవచ్చు?
హోమ్ లోన్ల కొరకు అర్హతను వీటి ద్వారా పెంచుకోవచ్చు
- సంపాదించే ఒక కుటుంబ సభ్యుడిని సహ-దరఖాస్తుదారుడుగా చేర్చుకోవడము.
- నిర్మాణాత్మక రీపేమెంట్ ప్లాన్‌ను పొందడం.
- స్థిరమైన ఆదాయము, క్రమమైన పొదుపులు మరియు పెట్టుబడులను నిర్ధారించడము.
- మీ క్రమానుసార అదనపు ఆదాయ వనరుల వివరాలను అందించడము.
- మీ జీతములో ఉన్న అస్థిరమైన అంశాల రికార్డ్ ను ఉంచడము.
- మీ క్రెడిట్ స్కోర్‌లో లోపాలను సరిచేయడానికి (ఏవైనా ఉంటే) చర్యలు తీసుకోవడం.
- ప్రస్తుతం కొనసాగుతున్న లోన్లు మరియు స్వల్పకాలిక లోన్లను తిరిగి చెల్లించడం
హెచ్ డి ఎఫ్ సి యొక్క అర్హతా క్యాలిక్యులేటర్ ను ఎలా ఉపయోగించాలి?
ఆన్లైన్ లో హోమ్ లోన్ల కొరకు అర్హతను పరీక్షించే హెచ్ డి ఎఫ్ సి అర్హతా క్యాలిక్యులేటర్ సదుపాయాలు.
- స్థూల ఆదాయము (నెలవారి) ₹ లలో: స్థూల నెలవారి ఆదాయాన్ని నమోదు చేయండి. NRIలు నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.
- లోన్ వ్యవధి (సంవత్సరాలలో): మీరు లోన్ అందుకోవాలనుకుంటున్న లోన్ కాలపరిమితిని ఇన్పుట్ చేయండి. దీర్ఘకాలిక కాలపరిమితి అర్హతను పెంచటంలో సహాయపడుతుంది.
- వడ్డీ రేటు (% సంవత్సరానికి.): హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న గృహ ఋణ వడ్డీ రేటును ఇన్పుట్ చేయండి. అమలులో ఉన్న వడ్డీ రేట్ల గురించి తెలుసుకొనుట్కౌ ఇక్కడ క్లిక్ చేయండి
- ఇతర EMI లు (నెలవారి): ఇతర లోన్లకు సంబంధించి మీ EMI లను ఇన్పుట్ చేయండి
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయండి మరియు మీ హోమ్ లోన్ అర్హతను లెక్కించండి
క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ అర్హత మరియు EMI మొత్తం గురించి మీరు సూచన పొందిన తర్వాత, హెచ్ డి ఎఫ్ సి ద్వారా ఆన్లైన్ హోమ్ లోన్లతో మీ ఇంటి నుండే లోన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హెచ్ డి ఎఫ్ సి తో ఆన్లైన్లో హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి, క్లిక్ చేయండి
మేము మిమ్మల్ని సంప్రదించాలని మీరు అనుకుంటే, దయచేసి మీ వివరాలను మాకు ఇవ్వండి. మీరు మీ కలల సౌధాన్ని గుర్తించడానికి ముందే హెచ్ డి ఎఫ్ సి ముందుగా-ఆమోదించబడే హోమ్ లోన్ సదుపాయాన్ని అందిస్తుంది.
ఈ క్యాలిక్యులేటర్లు సాధారణ స్వీయ-సహాయక ప్రణాళికా సాధనాలుగా మాత్రమే అందించబడినవి. వీటి ఫలితాలు, మీరు అందించే అంచనాలతో సహా అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వాటి ఖచ్ఛితత్వము లేదా మీ పరిస్థితులకు అనువర్తనము గురించి కాని మేము హామీ ఇవ్వలేము.