డిపాజిట్లు

ప్రతి ఒక్కరికీ తగిన పెట్టుబడులు

మీరు నాన్ రెసిడెంట్ ఇండియానా?
కాదు
అవును

డిపాజిట్లు గురించి

మూడున్నర దశాబ్దాలకు పైగా, ఫిక్స్డ్ డిపాజిట్లలో స్థిరమైన ప్రదర్శనను అందిస్తూ వచ్చింది హెచ్ డి ఎఫ్ సి. ఆరు లక్షలకు పైగా డిపాజిటర్ల నమ్మకాన్ని సంపాదించుకున్నాం.

హెచ్ డి ఎఫ్ సి తమ డిపాజిట్ల కార్యక్రమానికి రెండు ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు (CRISIL మరియు ICRA) నుండి వరుసగా 25 సంవత్సరాలపాటు AAA రేటింగ్స్ అందుకుంది, తద్వారా పెట్టుబడిదారులు మరియు ముఖ్య భాగస్వాముల వద్ద నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని పెంపొందించుకుంది.

మెరుగైన కస్టమర్ సంతృప్తి అన్నది HDFC అందించే అన్ని ప్రోడక్ట్స్ లోను ముఖ్యముగా ఉంటుంది. HDFC తమ డిపాజిటర్లకు దేశ వ్యాప్తంగా ఉన్న 420 ఇంటర్ కనెక్ట్ ఆఫీసుల ద్వారా మరియు 77 డిపాజిట్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తుంది. ఎలక్ట్రానిక్ పేమెంట్ వసతి ద్వారా వడ్డీ కట్టుట, డిపాజిట్ల మీద తక్షణ ఋణ సదుపాయం మరియు ఇతర సదుపాయాల ద్వారా ఎల్లప్పుడూ సేవలు అందించుటలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తుంది.

విశిష్ట లక్షణాలు

 • అత్యధిక భద్రత - AAA రేటింగ్ CRISIL మరియు ICRA ల ద్వారా వరుసగా గత 25 సంవత్సరాలుగా.
 • ఆకర్షణీయమైన మరియు ఖచ్చితమైన ఆదాయాలు.
 • దేశ వ్యాప్తంగా ఉన్న 420 నెట్వర్క్ ఆఫీసుల ద్వారా మచ్చలేని సేవలు.
 • ఎంచుకొనుటకు విస్తృత డిపాజిట్ ప్రోడక్టులు.
 • మా యొక్క ముఖ్య మా ముఖ్య భాగస్వాముల నెట్వర్క్ ద్వారా మీ గుమ్మం దగ్గరకు వచ్చి అందించే నమ్మకమైన సహాయం.
 • డిపాజిట్ మీద తక్షణ లోన్ సౌకర్యం.

మీరు భారత నివాసి అయితే, మా 18 నెలల నుండి 24 నెలల మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్ ఉత్పత్తుల యొక్క విస్తృత స్థాయి నుండి పోటీ వడ్డీ రేట్ల వద్ద మరియు వ్యక్తుల పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా వేర్వేరు లక్షణాలతో కూడిన వాటిలో నుంచి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. 60 ఏళ్ళ వయసు పై పడ్డ సీనియర్ సిటిజెన్లకు అన్ని డిపాజిట్ల పైన అదనంగా 0.25%సంవత్సరానికి ఇవ్వబడుతుంది.

 • మంత్లీ ఇన్కమ్ ప్లాన్
 • నాన్- కుములేటివ్ ఇంటరెస్ట్ ప్లాన్
 • ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్
 • కుములేటివ్ ఆప్షన్లు
  • మీకు క్రమానుగత నెలసరి ఆదాయం అందిస్తుంది.
  • ECS ద్వారా ప్రతి నెల వడ్డీ మీ బ్యాంక్ అక్కౌంట్ కు నేరుగా క్రెడిట్ చేయబడుతుంది.
  • రిటైర్ అయినవారికి, గృహిణులకు మరియు సీనియర్ సిటిజన్లకు అనుకూలమైనది
  • స్థిరమైన మరియు అస్థిరమైన వడ్డీ రేట్లలో లభిస్తుంది.
  • మీకు త్రైమాసిక లేక అర్ధ సంవత్సర ప్రాతిపదికన, క్రమానుగత సమయనుసారమైన వడ్డీ ఆదాయాన్ని అందిస్తుంది.
  • ఈసిఎస్ ద్వారా వడ్డీ మీ బ్యాంక్ అక్కౌంట్ కు నేరుగా క్రెడిట్ చేయబడుతుంది.
  • ప్రతి మూడు నెలల చివరిలోను లేదా ప్రతి ఆరు నెలల చివరిలోను మీ డబ్బు అవసరాలను ప్లాన్ చేసుకోవడానికి ఆదర్శవంతమైనది.
  • స్థిరమైన మరియు అస్థిరమైన వడ్డీ రేట్లలో లభిస్తుంది.
  • మీకు క్రమానుగత వార్షిక వడ్డీ ఆదాయాన్ని అందిస్తుంది.
  • ఈసిఎస్ ద్వారా వడ్డీ మీ బ్యాంక్ అక్కౌంట్ కు నేరుగా క్రెడిట్ చేయబడుతుంది.
  • అధిక రాబడులకు మరియు సంవత్సర డబ్బు అవసరాల ప్రణాళికకు ఆదర్శవంతమైన ఆప్షన్.
  • స్థిరమైన మరియు అస్థిరమైన వడ్డీ రేట్లలో లభిస్తుంది.
  • మీకు డిపాజిట్ చివరిలో ఒక పెద్ద మొత్తాన్ని అందిస్తుంది.
  • డబ్బు కూడబెట్టడానికి మరియు అధిక రాబడులకు ఆదర్శవంతమైన ఆప్షన్.
  • పిల్లల పై చదువులు / కళ్యాణం కొరకు ప్లాన్ చేసుకుంటున్న తల్లిదండ్రులకు అనుకూలమైనది.
  • స్థిరమైన మరియు అస్థిరమైన వడ్డీ రేట్లలో లభిస్తుంది.

ఫీచర్లు

మీరు డిపాజిట్ ఓపెన్ చేసిన మూడు నెలల తరువాత ఆ డిపాజిట్ మీద 75% వరకు లోన్ తీసుకొనవచ్చును, HDFC నిబంధనలు మరియు షరతులు ప్రకారం. అటువంటి లోన్లు యొక్క వడ్డీ డిపాజిట్ రేటు కన్నా 2% ఎక్కువ ఉంటుంది.

ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ సదుపాయం అందుబాటులో ఉన్న చోట మీ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ నేరుగా మీ అకౌంట్ కు దాని ద్వారా క్రెడిట్ చేయబడుతుంది.

ఏ రోజు చెక్ క్లియర్ అవుతుందో లేదా బ్యాంకు అకౌంట్ లో వస్తుందో, ఆ రోజు నుండి మీ డిపాజిట్ పైన వడ్డీ ఇవ్వబడును. మంత్లీ ఇన్కమ్ ప్లాన్, కుములేటివ్ గాని డిపాజిట్ మరియు వార్షిక ఆదాయ పధకం డిపాజిట్ల మీద వడ్డీ క్రింద తెలుపబడిన తేదీలలో ఇవ్వబడును:

డిపాజిట్ పధకాలు స్థిర తేదీలు
మంత్లీ ఇన్కమ్ ప్లాన్ (ఎంఐపి) ప్రతి నెల చివరి రోజు
నాన్-కుములేటివ్ : త్రైమాసిక పధకం జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 & మార్చ్ 31
నాన్-కుములేటివ్ : ఆరు నెలల పధకం సెప్టెంబర్ 30 మరియు మార్చ్ 31
ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ (ఏఐపి) మార్చ్ 31

కుములేటివ్ వడ్డీ ఆప్షన్ : వడ్డీ ప్రతి సంవత్సరము మార్చ్ 31 న డిపాజిట్ అమౌంట్ లో కలప బడుతుంది టాక్స్ మినహాయించిన తరువాత, ఎక్కడ వర్తిస్తుందో. డిపాజిట్ అమౌంట్ వడ్డీతో పాటు మెచూరిటీ రోజున సంతకం పెట్టిన డిపాజిట్ రసీదును మేము అందుకున్న వెంటనే ఇవ్వబడును. వడ్డీ అమౌంట్ ను (టాక్స్ మినహాయించిన తరువాత - ఎక్కడ వర్తిస్తుందో) ఈ సీ ఎస్ ద్వారా పంపబడును ఈ సీ ఎస్ సదుపాయం ఉన్న సెంటర్లలో. ఈ సీ ఎస్ సదుపాయం లేని పక్షంలో, వడ్డీ అమౌంట్ కు అక్కౌంట్ పేయీ చెక్ ప్రధమ డిపాజిటర్ పేరు మీద వారి యొక్క బ్యాంక్ అక్కౌంట్ వివరాలతో ఇవ్వబడును. అస్థిర డిపాజిట్ రేటు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో వచ్చే వడ్డీను ప్రతి నెల ఆఖరి రోజున డిపాజిటర్ బ్యాంక్ అక్కౌంట్ కు ఈ సీ ఎస్ ద్వారా మాత్రమే క్రెడిట్ చేయబడును. డిపాజిట్ రెన్యూ చేసినట్లైతే వడ్డీ సమకూర్చబడును.

వడ్డీ రేటు (ఆర్ఒఐ) ప్రతి వడ్డీ లెక్కించే పీరియడ్ మొదట్లో రీసెట్ చేయబడుతుంది. వడ్డీ లెక్కించే పీరియడ్ మొదటి రోజున ఎంత ఆర్ఒఐ ఉంటుందో ఆ వడ్డీ రేటే మొత్తం వడ్డీ పీరియడ్ కు వర్తిస్తుంది.

సంవత్సరానికి ₹5,000 లోపు వడ్డీ పై టాక్స్ మినహాయింపు ఉండదు. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, 1961, సెక్షన్ 194ఏ ప్రకారం అప్పుడు వున్న టాక్స్ రేట్ల బట్టి టాక్స్ మినహాయించ బడుతుంది. ఒకవేళ డిపాజిటర్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకపోతే మరియు వడ్డీ మొత్తం ఇన్కమ్ టాక్స్ కు వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ ఉండకపోయిన, డిపాజిటర్ ఫారం 15జి ఇచ్చినచో ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చేయబడదు. అటువంటప్పుడు, పాన్ (పెర్మనెంట్ అక్కౌంట్ నెంబర్) ఫారం 15జి లో తప్పకుండ సూచించ వలెను, లేనిచో ఫారం 15జి చెల్లదు. సీనియర్ సిటిజన్లు (అరవై ఏళ్ళకు పై పడినవారు) ఫారం 15హెచ్ ఇవ్వవలెను. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, 1961, సెక్షన్ 139ఏ(5ఏ) ప్రకారం ఆదాయం లో ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఉన్న ప్రతి మనిషి తమ యొక్క పాన్ వివరాలను ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చేసే వారికి ఇవ్వవలెను. ఇంకా, 139ఏ(5బి) ప్రకారం ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చేసేవారు పాన్ వివరాలను టి డి యెస్ సర్టిఫికేట్ లో రాయవలెను. ఒకవేళ పాన్ వివరాలు రాయకపోతే, సెక్షన్ 206ఏఏ(1) ప్రకారం టి డి యెస్ 20 శాతం మినహాయించవలెను. డిపాజిట్ అమౌంట్ ₹50,000 లకు పైగా ఉంటే, పాన్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వవలెను.

మీ డిపాజిట్ మెచూరిటీ కన్నా ముందుగానే తీసివేయు రిక్వెస్ట్ ను మీ హక్కు గా భావించకూడదు, అది హెచ్ డి ఎఫ్ సి వారి నిర్ణయం మీద ఆధార పడి ఉంటుంది, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ (ఎన్ హెచ్ బి) 2010 ఆదేశాల ప్రకారం.

డిపాజిట్ ఓపెన్ చేసిన మూడు నెలల లోపు మెచ్యూరిటీకి ముందుగానే విత్ డ్రా చేయటం అనుమతించబడదు. ఒకవేళ డిపాజిట్ ఓపెన్ చేసిన మూడు నెలల తరువాత మెచ్యూరిటీకి ముందుగానే విత్ డ్రా చేయటానికి అభ్యర్దిస్తే, ఈ దిగువ టేబుల్ లో ఇచ్చిన రేట్లు వర్తిస్తాయి.

డిపాజిట్ చేసిన తేదీ నుండి గడిచిన నెలలు  చెల్లించవలసిన వడ్డీ రేటు
మూడు నెలల తరువాత కాని ఆరు నెలల ముందు The interest payable shall be 3% per annum for individual depositor, and no interest in case of other category of depositors
ఆరు నెలల తరువాత కాని డిపాజిట్ మెచ్యూరిటీ రోజు కన్నా ముందు డిపాజిట్ ఎన్ని రోజులు బ్యాంకులో ఉంచుతారో అన్ని రోజులకు పబ్లిక్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటుకు 1% తక్కువ చేసి వడ్డీ ఇవ్వబడును లేదా ఆ పీరియడ్ కు రేటు ఏమీ పేర్కొనని పక్షంలో, హెచ్ డి ఎఫ్ సి పబ్లిక్ డిపాజిట్ల పై ఇచ్చే కనీస వడ్డీ రేటుకి 2% తక్కువ చేసి ఇవ్వబడును.

డిపాజిట్ రెన్యువల్ మరియు రి పేమెంట్ కొరకు మీరు కనీసం వారం రోజులు ముందుగానే సంతకం చేసిన డిపాజిట్ రసీదు హెచ్ డి ఎఫ్ సి కు ఇవ్వవలెను. డిపాజిట్ రెన్యువల్ అయితే, అదే సమయంలో అన్ని డిపాజిటర్లు సూచించిన అప్లికేషన్ ఫారం పై సంతకం చేసి ఇవ్వవలెను. ఒకవేళ డిపాజిట్ మెచ్యూరిటీ రోజు హెచ్ డి ఎఫ్ సి ఆఫీసుకు సెలవు అయితే మరుసటి రోజున రి పేమెంట్ చేయబడును. డిపాజిటర్ అభ్యర్ధన మేరకు డిపాజిట్ రి పేమెంట్ డిపాజిట్ ప్రధమ డిపాజిటర్ పేరు మీద అకౌంట్ పేయీ చెక్ ఇవ్వబడును లేదా ప్రధమ డిపాజిటర్ బ్యాంకు అకౌంట్ కు నేరుగా NEFT/RTGS చేయబడును.

వ్యక్తిగత డిపాజిటర్లు, ఒక్కరిగా లేదా సంయుక్తంగా మాత్రమే, ఈ సదుపాయం క్రింద ఒక వ్యక్తిని నామినేట్ చేయవచ్చును. ఒకవేళ డిపాజిట్ మైనర్ పేరున ఉంటే, చట్టబద్ధంగా ఆ మైనర్ తరపున వ్యవహరించే వ్యక్తి నామినేషన్ చేయవచ్చును. పవర్ అఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి, లేదా ఒక ఆఫీస్ తరపున వ్యవహరించే వ్యక్తి నామినేషన్ చేయకూడదు. నామినీ చేయబడిన వ్యక్తి హెచ్ డి ఎఫ్ సి నుండి ఆ డిపాజిట్ మొత్తం అందుకునే హక్కులు ఉంటాయి మరియు ఆ నామినీ కు హెచ్ డి ఎఫ్ సి మొత్తం చెల్లించిన తరువాత హెచ్ డి ఎఫ్ సి కు ఆ డిపాజిట్ పైన ఎటువంటి భాద్యత ఉండదు. నామినీ పేరు ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు పైన ప్రింట్ చేయబడును, వేరే విధంగా పేర్కొనకపోతే.

ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్, 2002, నిబంధనల ప్రకారం, నేషనల్ హోసింగ్ బ్యాంకు (NHB) జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం, మీరు ఈ దిగువ సూచించిన డాక్యూమెంట్లు ఇవ్వవలెను KYC అవసరాలు పూర్తి చేయడానికి:

 • ఇటీవలి ఫోటో
 • మీ గుర్తింపు ప్రూఫ్ యొక్క సర్టిఫైడ్ కాపీ
 • మీ అడ్రస్ ప్రూఫ్ యొక్క సర్టిఫైడ్ కాపీ

ఒకవేళ ఇంతకు ముందు డిపాజిట్ కు ఈ డాక్యుమెంట్లు ఇచ్చి ఉంటే మరల తిరిగి ఈ డాక్యుమెంట్లు ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ మీ కస్టమర్ నెంబర్ లేదా డిపాజిట్ నెంబర్ ఇవ్వవలెను. 

వడ్డీ రేట్లు

ఆగస్ట్ 28, 2020 నుండి అమలులోకి వచ్చింది

ప్రత్యేక డిపాజిట్లు (స్థిర రేట్లు) ₹2 కోట్ల వరకు డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
33 నెలలు 5.85% 5.90% 5.95% 6.05% 6.05%
66 నెలలు 6.05% 6.10% 6.15% 6.25% 6.25%

ప్రీమియం డిపాజిట్లు (స్థిర రేట్లు) ₹2 కోట్ల వరకు డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
15 నెలలు 5.70% 5.75% 5.80% - 5.90%
22 నెలలు 5.80% 5.85% 5.90% 6.00% 6.00%
30 నెలలు 5.75% 5.80% 5.85% 5.95% 5.95%
44 నెలలు 6.00% 6.05% 6.10% 6.20% 6.20%

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹2 కోట్ల వరకు డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.65% 5.70% 5.75% - 5.85%
24-35 నెలలు 5.65% 5.70% 5.75% 5.85% 5.85%
36-84 నెలలు 5.85% 5.90% 5.95% 6.05% 6.05%
కనీస అమౌంట్ (₹) ₹40,000 ₹20,000 ₹20,000 ₹20,000 ₹20,000

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹2 కోట్ల కంటే ఎక్కువ మరియు ₹5 కోట్ల వరకు ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.35% 5.40% 5.45% - 5.55%
24-35 నెలలు 5.35% 5.40% 5.45% 5.55% 5.55%
36-84 నెలలు 5.55% 5.60% 5.65% 5.75% 5.75%

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹5 కోట్ల కంటే ఎక్కువ మరియు ₹10 కోట్ల వరకు ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.05% 5.10% 5.15% - 5.25%
24-35 నెలలు 5.05% 5.10% 5.15% 5.25% 5.25%
36-84 నెలలు 5.25% 5.30% 5.35% 5.45% 5.45%

ఆగస్ట్ 28, 2020 నుండి అమలులోకి వచ్చింది

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹10 కోట్ల కంటే ఎక్కువ మరియు ₹25 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.00% 5.05% 5.10% - 5.20%
24-35 నెలలు 5.00% 5.05% 5.10% 5.20% 5.20%
36-84 నెలలు 5.20% 5.25% 5.30% 5.40% 5.40%

ఆగస్ట్ 28, 2020 నుండి అమలులోకి వచ్చింది

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹25 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 4.70% 4.75% 4.80% - 4.90%
24-35 నెలలు 4.70% 4.75% 4.80% 4.90% 4.90%
36-84 నెలలు 4.90% 4.95% 5.00% 5.10% 5.10%

రికరింగ్ డిపాజిట్స్ ప్లాన్ (RD) స్థిర వడ్డీ రేటు ఇన్స్టాల్మెంట్ డిపాజిట్ ప్లాన్
డిపాజిట్ గడువు ROI (సంవత్సరానికి) #
12-60 నెలలు 5.55%

*కనీస నెలవారీ పొదుపు మొత్తం ₹2,000/-

*A. ₹2 కోట్ల వరకు డిపాజిట్ల పై సీనియర్ సిటిజన్స్ (60 సంవత్సరాలు +) సంవత్సరానికి అదనంగా 0.25% (రికరింగ్ డిపాజిట్లు కాకుండా) పొందడానికి అర్హత కలిగి ఉంటారు

*B. మా ఆన్‌లైన్ వ్యవస్థ మరియు ఆటో-రెన్యూడ్ డిపాజిట్ల ద్వారా ప్లేస్ చేయబడిన/రెన్యూ చేయబడిన ప్రతి నెలకు ₹ 25 లక్షల వరకు వ్యక్తిగత డిపాజిట్లపై (RD కాకుండా) ₹ 0.10% వరకు అదనపు ROI వర్తిస్తుంది.

*C. క్యుములేటివ్ ఎంపిక కోసం, వడ్డీ సంవత్సరానికి కాంపౌండ్ చేయబడుతుంది.

వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి, డిపాజిట్ ఓపెన్ చేసిన రోజు ఉండే రేట్లు వర్తిస్తాయి.

ఆగస్ట్ 28, 2020 నుండి అమలులోకి వచ్చింది

ప్రత్యేక డిపాజిట్లు (స్థిర రేట్లు) ₹2 కోట్ల వరకు డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
33 నెలలు 5.70% 5.75% 5.80% 5.90% 5.90%
66 నెలలు 5.90% 5.95% 6.00% 6.10% 6.10%
కనీస అమౌంట్ (₹) ₹40,000 ₹20,000 ₹20,000 ₹20,000 ₹20,000

ప్రీమియం డిపాజిట్లు (స్థిర రేట్లు) ₹2 కోట్ల వరకు డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
15 నెలలు 5.65% 5.70% 5.75% - 5.85%
30 నెలలు 5.65% 5.70% 5.75% 5.85% 5.85%
కనీస అమౌంట్ (₹) ₹40,000 ₹20,000 ₹20,000 ₹20,000 ₹20,000

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹2 కోట్ల వరకు డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.55% 5.60% 5.65% - 5.75%
24-35 నెలలు 5.55% 5.60% 5.65% 5.75% 5.75%
36-84 నెలలు 5.75% 5.80% 5.85% 5.95% 5.95%
కనీస అమౌంట్(₹) ₹40000 ₹20000 ₹20000 ₹20000 ₹20000

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹2 కోట్ల కంటే ఎక్కువ మరియు ₹5 కోట్ల వరకు ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.35% 5.40% 5.45% - 5.55%
24-35 నెలలు 5.35% 5.40% 5.45% 5.55% 5.55%
36-84 నెలలు 5.55% 5.60% 5.65% 5.75% 5.75%

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹5 కోట్ల కంటే ఎక్కువ మరియు ₹10 కోట్ల వరకు ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.05% 5.10% 5.15% - 5.25%
24-35 నెలలు 5.05% 5.10% 5.15% 5.25% 5.25%
36-84 నెలలు 5.25% 5.30% 5.35% 5.45% 5.45%

ఆగస్ట్ 28, 2020 నుండి అమలులోకి వచ్చింది

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹10 కోట్ల కంటే ఎక్కువ మరియు ₹25 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 5.00% 5.05% 5.10% - 5.20%
24-35 నెలలు 5.00% 5.05% 5.10% 5.20% 5.20%
36-84 నెలలు 5.20% 5.25% 5.30% 5.40% 5.40%

ఆగస్ట్ 28, 2020 నుండి అమలులోకి వచ్చింది

సాధారణ డిపాజిట్లు (స్థిర & అస్థిర రేట్లు) ₹25 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లు (సంవత్సరానికి)
కాలవ్యవధి మంత్లీ ఇన్కమ్ ప్లాన్ క్వార్టర్లీ ఆప్షన్ హాఫ్ ఇయర్లీ ఆప్షన్ ఆన్యువల్ ఇన్కమ్ ప్లాన్ కుములేటివ్ ఆప్షన్
12-23 నెలలు 4.70% 4.75% 4.80% - 4.90%
24-35 నెలలు 4.70% 4.75% 4.80% 4.90% 4.90%
36-84 నెలలు 4.90% 4.95% 5.00% 5.10% 5.10%

వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి, డిపాజిట్ ఓపెన్ చేసిన రోజు ఉండే రేట్లు వర్తిస్తాయి.

ముఖ్య భాగస్వామి అవ్వండి

హెచ్ డి ఎఫ్ సి 17 లక్షల పైగా డిపాజిటర్ల నుంచి డబ్బు సేకరించింది. మా డిపాజిట్ ప్రోడక్టులు CRISIL మరియు ICRA రేటింగ్ సంస్థల ద్వారా గత 25 సంవత్సరాలుగా "AAA" రేటింగ్ తెచ్చుకున్నాయి మరియు మేము అధిక స్టాండర్డ్ గల సేవలను అందిస్తాం.

మా యొక్క అన్ని రిటైల్ సేవింగ్ ప్రోడక్ట్స్ మా ముఖ్య భాగస్వాముల ద్వారా పంపిణీ చేయబడును. ఆకర్షణీయమైన బ్రోకరేజ్ / కమిషన్ తో పాటు, మా ముఖ్య భాగస్వాములు ఇతర ఫైనాన్షియల్ వ్యవస్థల ప్రోడక్ట్స్ కు కూడా ఏజెంట్స్ గా పని చేయవచ్చును. దీని వలన, ముఖ్య భాగస్వాములుగా ఉన్న మీకు, మీ కస్టమర్లకు ఆఫర్ చేయడానికి మీ దగ్గర విభిన్న పెట్టుబడి ఆప్షన్స్ ఉండును.

 • ఆకర్షణీయమైన వేతన పధకం
 • విస్తృతమైన సహాయం హెచ్ డి ఎఫ్ సి సిబ్బంది ద్వారా
 • సురక్షిత మరియు భధ్రమైన ప్రోడక్ట్ లైన్
 • వరల్డ్-క్లాస్ సంస్థ యొక్క కీర్తి
 • ప్రముఖ గృహ బ్రాండ్
 • ఇతర ఫైనాన్షియల్ సంస్థల కు కూడా డిస్ట్రిబ్యూటర్ అయ్యే ఆప్షన్

2 సులువైన స్టెప్ లు అనుసరించండి

దశ 1

దిగువ ఇచ్చిన లింక్ లో ఉన్న ఫార్మ్ నింపి మీ దగ్గరలో ఉన్న హెచ్ డి ఎఫ్ సి డిపాజిట్ సెంటర్ లో ఇవ్వండి లేదా ఏదైనా హెచ్ డి ఎఫ్ సి డిపాజిట్ల బ్రాంచ్ కు వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ తీసుకోండి.

డిపాజిట్స్ ఏజెంట్ల ఫారం

దశ 2

మిమ్మలను ఇంటర్వ్యూ చేసి మీరు అనుకూలంగా ఉంటే, మిమ్మలను అధీకృత ముఖ్య భాగస్వామిగా రిజిస్టర్ చేసుకుంటాం.

భారతదేశ వ్యాప్తంగా హెచ్ డి ఎఫ్ సి డిపాజిట్ల సెంటర్లు

సంభాషించుకుందాం!