భారతదేశంలో హోమ్ లోన్ ప్రాసెస్ సాధారణంగా ఈ క్రింది దశల ద్వారా వెళ్తుంది:
హోమ్ లోన్ అప్లికేషన్ మరియు డాక్యుమెంటేషన్
హెచ్ డి ఎఫ్ సి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీచర్‌తో మీరు మీ ఇంటి నుండే సౌకర్యంగా ఆన్లైన్లో హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, మా లోన్ నిపుణులు మిమ్మల్ని సంప్రదించడానికి మరియు మీ లోన్ అప్లికేషన్‌ను ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు మీ సంప్రదింపు వివరాలను ఇక్కడ పంచుకోవచ్చు.
మీ హోమ్ లోన్ అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించవలసిన డాక్యుమెంటేషన్ ఇక్కడఅందుబాటులో ఉంది. ఈ లింక్ మీ హోమ్ లోన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం అవసరమైన KYC, ఆదాయం మరియు ఆస్తి సంబంధిత డాక్యుమెంట్ల వివరణాత్మక చెక్లిస్ట్ను అందిస్తుంది. చెక్‌లిస్ట్ సూచనాత్మకమైనది మరియు హోమ్ లోన్ శాంక్షన్ ప్రాసెస్ సమయంలో అదనపు డాక్యుమెంట్లు అడగవచ్చు.
హోమ్ లోన్ యొక్క ఆమోదం మరియు పంపిణీ
అప్రూవల్ ప్రాసెస్: పైన పేర్కొన్న చెక్‌లిస్ట్ ప్రకారం సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా హోమ్ లోన్ అంచనా వేయబడుతుంది మరియు ఆమోదించబడిన మొత్తం కస్టమర్‌కు తెలియజేయబడుతుంది. అప్లై చేసిన హౌసింగ్ లోన్ మొత్తం, అప్రూవ్ చేయబడిన మొత్తం మధ్య తేడా ఉండవచ్చు. హౌసింగ్ లోన్ అప్రూవల్ తర్వాత, అప్లికెంట్లు నెరవేర్చవలసిన లోన్ మొత్తం, అవధి, వర్తించే వడ్డీ రేటు, రీపేమెంట్ విధానం మరియు ఇతర ప్రత్యేక షరతులను వివరించే ఒక శాంక్షన్ లెటర్ జారీ చేయబడుతుంది.
పంపిణీ ప్రాసెస్: హోమ్ లోన్ పంపిణీ ప్రాసెస్ అసలు ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లను హెచ్ డి ఎఫ్ సి కు సబ్మిట్ చేయడంతో ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆస్తి నిర్మాణంలో ఉన్న ఆస్తి అయితే, డెవలపర్ ద్వారా అందించబడిన నిర్మాణంకి అనుసంధానించబడిన చెల్లింపు ప్లాన్ ప్రకారం విడతలలో పంపిణీ చేయబడుతుంది. నిర్మాణం/గృహ అభివృద్ధి/గృహ విస్తరణ లోన్ల విషయంలో, అందించిన అంచనా ప్రకారం నిర్మాణం/మెరుగుదల పురోగతి ప్రకారం పంపిణీ చేయబడుతుంది. రెండవ అమ్మకం / రీసేల్ ఆస్తుల కోసం ఒక సేల్ డీడ్ అమలు చేసే సమయంలో పూర్తి లోన్ మొత్తం పంపిణీ చేయబడుతుంది.
హోమ్ లోన్ రీపేమెంట్
హోమ్ లోన్ల రీపేమెంట్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (EMIలు) ద్వారా చేయబడుతుంది, ఇది వడ్డీ మరియు అసలు కలయిక. రీసేల్ హోమ్స్ లోన్స్ విషయంలో, లోన్ పంపిణీ చేయబడిన నెల తరువాత EMI మొదలవుతుంది. నిర్మాణంలో ఉన్న ఆస్తుల లోన్ల విషయంలో, నిర్మాణం పూర్తయిన తర్వాత మరియు హౌస్ లోన్ పూర్తిగా పంపిణీ చేయబడిన తర్వాత EMI సాధారణంగా ప్రారంభమవుతుంది. అయితే కస్టమర్లు తమ EMIలను త్వరలో ప్రారంభించడానికి కూడా ఎంచుకోవచ్చు. నిర్మాణం యొక్క పురోగతి ప్రకారం చేయబడిన ప్రతి పాక్షిక పంపిణీతో EMI లు తదనుగుణంగా పెరుగుతాయి.