ప్రాసెసింగ్ రుసుము
రుణ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3,000 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.
బాహ్య అభిప్రాయము కోసం ఫీజు
న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.
ఆస్తి ఇన్సూరెన్స్
వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.
ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు
ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.
ఆకస్మిక ఖర్చులు
ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.
చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు
స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in
ఇతర ఛార్జీలు
టైప్ |
ఛార్జీలు |
చెక్ డిస్హానర్ ఛార్జీలు |
₹300** |
డాక్యుమెంట్ల జాబితా |
₹500 వరకు |
డాక్యుమెంట్ల ఫోటో కాపీ |
₹500 వరకు |
PDC స్వాప్ |
₹500 వరకు |
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ |
₹500 వరకు |
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ |
₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు |
హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్వాంటేజ్ స్కీమ్ కింద తాత్కాలిక ప్రీపేమెంట్ రివర్సల్ |
రివర్సల్ సమయంలో రూ. 250/- మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు |