హెచ్‌ డి ‌ఎఫ్‌ సి లో ఉద్యోగావకాశాలు

Video Image

హెచ్ డి ఎఫ్ సి హృదయంలో ఈ సంస్థను నడుపుతున్న వ్యక్తులు ఉన్నారు. ఒక సానుకూలమైన పని వాతావరణంలో తగినంత శిక్షణ ఇచ్చి వాళ్ళ కెరీర్ అభివృద్ధి చేయడం మీద దృష్టి పెట్టి మాతో పని చేసే వారిని సదా అభివృద్ధి చేయలనేదే మా ప్రయత్నం. హెచ్ డి ఎఫ్ సి కు ఒక అత్యంత ప్రేరణ పొందిన నిపుణుల టీం ఉందని మరియు పరిశ్రమలోనే తక్కువ ఉద్యోగుల నిష్క్రమణ రేటు ఉందని మేము గొప్ప గర్వంతో చెప్పగలం.

మీరు ఒక యువ , సామర్ధ్యం గల వ్యక్తి, సవాళ్ళను ఆనందించే మంచి వ్యక్తిగత విలువలు ఉన్న వ్యక్తి, రాణించాలని అభిరుచి ఉన్న వ్యక్తి మరియు మా సంస్థ సంస్కృతికి తగిన వ్యక్తి అయితే, మీరు హెచ్ డి ఎఫ్ సి అభివృద్ధి ప్రయాణంలో ఒక భాగం కావచ్చు.

హెచ్ డి ఎఫ్ సి ఎందుకు?

దేశంలో ప్రధానమైన హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ

గత 41 సంవత్సరాల్లో స్థిరమైన అధిక వృద్ధి రేటు, యువ నిపుణులకు కంపెనీతో పాటు ఎదగడానికి తగినంత నేర్చుకునే అవకాశాలను అందించింది

సలహాలను స్వీకరించే మరియు సాధారణంగా ఉండే పని సంస్కృతికి భిన్నమైన సంస్కృతిలో మేము సమగ్రత, నిబద్ధత, టీం వర్క్ మరియు శ్రేష్ఠమైన కస్టమర్ సర్వీస్ లకు విలువ ఇస్తాము.

'చేస్తూ నేర్చుకోవడం' అనే తత్త్వం నిర్ణయం తీసుకోవడం మరియు నైపుణ్యాలను నిర్మించటాన్ని ప్రోత్సహించును. మా ఉద్యోగుల 'దీర్ఘకాల సంపద సృష్టి' మీద దృష్టి.

ప్రస్తుత ఖాళీలు

ప్రస్తుత ఖాళీలు

14 ఫలితాలు
ముంబై
రికవరీలు/కలెక్షన్లు ఫీల్డ్ ఆఫీసర్-ముంబై
అవసరమైన అనుభవం: బ్యాంక్ లేదా NBFC వద్ద గరిష్టంగా 3 నుండి 7 సంవత్సరాల అనుభవం. బ్యాంక్ / సంస్థ యొక్క రోల్స్ పై ఉండాలి (సరైన నైపుణ్యాలు మరియు ఫీల్డ్ వర్క్ పై ఆసక్తి కలిగిన ఫ్రెషర్ కూడా పరిగణలోనికి తీసుకోబడతారు)
చదువు: మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్

ఉద్యోగ వివరణ

ఓవర్‍డ్యూ అకౌంట్ల రికవరీ కోసం రుణగ్రహీతలను సందర్శించడం / సంప్రదించడం, బకాయి పడిన అకౌంట్లను మేనేజ్ చేయడం. డిఫాల్టింగ్ కేసులను మదింపు చేయడం మరియు తగిన సిఫార్సులు చేయడం.

కావలసిన అభ్యర్థి ప్రొఫైల్

  • అతను ప్రయాణం చేయడానికి మరియు విస్తృతమైన అవుట్‍డోర్ కార్యకలాపాలను చేపట్టడానికి సిద్ధంగా ఉండాలి.
  • అభ్యర్థి అద్భుతమైన కమ్యూనికేషన్లు, ఇంటర్-పర్సనల్ మరియు సంభాషణ నైపుణ్యాలు కలిగి ఉండాలి, ఒప్పించగల నైపుణ్యం మరియు వ్యవహారం నడిపే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • అతను విశ్లేషణా స్కిల్స్ మరియు ప్రాధమిక అకౌంటింగ్ జ్ఞానం కలిగి ఉండాలి.
  • ప్రాంతీయ భాష మరియు ఆంగ్లంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
  • ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • వాణిజ్య చట్టం మరియు SRFAESI చట్టం గురించి అవగాహన కలిగి ఉండడం శ్రేయస్కరం
  • ఒక టీమ్ ప్లేయర్ అయి ఉండాలి.

అభ్యర్థులు కోరుకునే నివాస స్థానం

థానే వెలుపల (ఉదా. అంబర్నాథ్, డోంబివలి, కళ్యాణ్, బద్లాపూర్ ) &

బోరివలి మరియు వెలుపల (ఉదా. నల్లసోపర, విరార్, వసై, బోయిసర్, పాల్ఘర్ )

కోయంబత్తూర్
రికవరీ/కలెక్షన్స్ ఆఫీసర్-కోయంబత్తూర్
కావలసిన అనుభవం: 1-4 సంవత్సరాలు
చదువు: మేనేజ్మెంట్ లేదా లా లో పోస్ట్ గ్రాడ్యుయేట్

ఉద్యోగ వివరణ

బకాయి మొత్తం యొక్క రికవరీ- చెల్లింపును ఎగవేసే రుణదాతలను క్రమం తప్పకుండా సంప్రదించి బకాయి మొత్తాలను రికవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం. ఎగవేత కేసులను మదింపు చేయడం మరియు తగిన చర్యలను తీసుకోవడం.
పోర్ట్‌ఫోలియో/డెలిన్క్వెన్సీ మానేజ్మెంట్- IT ఆధారిత రికవరీ సాధనాలను, చట్టం ఆధారిత రెజల్యూషన్ పద్ధతులు మరియు పోర్ట్‌ఫోలియో క్రెడిట్ రిస్క్ అసెస్‌మెంట్ సాధనాలను ఉపయోగించి లోన్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం మరియు డెలిన్క్వెన్సీలను నియంత్రించడం.
NPA మానేజ్మెంట్- NPA అకౌంట్ల రెజల్యూషన్ మరియు రికవరీ కోసం సమయానికి అన్ని అవసరమైన చర్యలు మరియు తగినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం.
MIS సమీక్ష- పోర్ట్‌ఫోలియోను నిర్వహించడంలో సహాయం చేయడానికి రికవరీ సంబంధిత సమాచారాన్ని సమీక్షించడం మరియు విశ్లేషించడం.

కావలసిన అభ్యర్థి ప్రొఫైల్

ఉత్తమ సంభాషణ/లేఖన సామర్థ్యం మరియు మంచి శ్రోత అయి ఉండాలి (ప్రాంతీయ భాషలో నైపుణ్యం తప్పనిసరి). ఉన్నత స్థాయిలో సమగ్రత మరియు వ్యాపార నైతికతను ప్రదర్శించడం. మంచి సంప్రతింపు నైపుణ్యాలు, ప్రజలతో మంచి సంబంధాలు నెరపగలిగే నైపుణ్యాలు మరియు బాకీ మొత్తాలను పరిష్కరించడానికి అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే విధంగా ఒప్పించే సామర్థ్యం కలిగి ఉండడం. SARFAESI సహా సంబంధిత చట్టాలు మరియు యాక్ట్‌ల (సవరణలతో సహా) గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం. ఆయా ప్రాంతంలో విస్తృతంగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాలి.

బెంగుళూర్
రిలేషన్షిప్ మేనేజర్ - రిటైల్ లెండింగ్ - బెంగళూరు
కావలసిన అనుభవం: 0-5
చదువు : PG - MBA / PGDM - ఫైనాన్స్, మార్కెటింగ్

ఉద్యోగ వివరణ

ఇందులో ఉండేవి రిటైల్ కస్టమర్లను కలుసుకొనుట మరియు మాట్లాడుట, వారి క్రెడిట్ విలువలను అంచనా వేయుట, వారి యొక్క ప్రత్యేకమైన అవసరాలను తెలుసుకొనుట మరియు సరైన పరిష్కారాలు ఇచ్చుట. ఇంకా ఇందులో ఉండేవి లోన్ ప్రాసెసింగ్, కౌన్సిలింగ్ ద్వారా నాణ్యమైన పోర్ట్ఫోలియో సృష్టించి మరియు పట్టి ఉంచుట, రిస్క్ మేనేజ్మెంట్, ప్రక్రియ మెరుగుదల, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా బయట మరియు అంతర్గత కస్టమర్ల నిబద్ధత తద్వారా హెచ్ డి ఎఫ్ సి కస్టమర్లకు విలువ జోడించడం. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ల నుండి బిజినెస్ మెరుగుపరుచుట, హెచ్ డి ఎఫ్ సి కు బిజినెస్ తెచ్చుటకు కార్పొరేట్ / డెవలపర్లతో కొత్త ఏర్పాట్లను ఏర్పాటు చేయడం.

కావలసిన అభ్యర్థి ప్రొఫైల్

అభ్యర్థి వివిధ ప్రోడక్ట్స్ గురించి వివరించుటకు గణనీయమైన సహనం కలిగి ఉండవలెను మరియు తన/ఆమె కు తెలిసిన జ్ఞానం బిజినెస్ అభివృద్ధికి సహాయపడవలెను. పైన వివరించిన స్థానానికి కావలసినవి అధిక శక్తి స్థాయిలు, సమగ్రత, కస్టమర్ కు సేవ చేయాలనే ధోరణి, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (నోటి మరియు వ్రాత), ఒప్పించే స్కిల్స్, ప్రక్రియ ధోరణి, టైం మేనేజ్మెంట్, టీం తో కలిసి పనిచేసే స్కిల్స్ మరియు ఫలితాలను సాధించడానికి బలమైన పట్టుదల

ముంబై
క్రెడిట్ అప్రైజర్ - సిఏ - స్వయం ఉపాధి పొందే వారు - ముంబై
కావలసిన అనుభవం: 0-2
చదువు: CA (ఛార్టర్డ్ అకౌంటెంట్)

ఉద్యోగ వివరణ

- స్వయం ఉపాధి పొందే కస్టమర్ల క్రెడిట్ విలువలను అంచనా వేయుట.

-కస్టమర్లతో సంభాషణ లోన్ అప్రైసల్ మరియు లోన్ సర్వీసింగ్ అవసరాలు
- కస్టమర్లను కలుసుకొనుట మరియు వ్యక్తిగత సంభాషణలు జరుపుట. సరైనది సూచించుట

   కస్టమర్ల అవసరాలకు పరిష్కారాలు
- బిజినెస్ పర్యటన మరియు తనిఖీ.
- డాక్యుమెంట్లు సేకరించుట మరియు వెరిఫై చేయుట
- ప్రపోజల్అప్రూవల్ కొరకు సిఫార్సు చేయుట
- కొత్త మరియు బిజినెస్ పెరుగుదలకు ప్లానింగ్ చేయుట మరియు మార్గాలు అమలు చేయుట

కావలసిన అభ్యర్థి ప్రొఫైల్

పైన వివరించిన స్థానానికి కావలసినవి అధిక శక్తి స్థాయిలు, సమగ్రత, కస్టమర్ కు సేవ చేయాలనే ధోరణి, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (నోటి మరియు వ్రాత), ఒప్పించే స్కిల్స్, ప్రక్రియ ధోరణి, టైం మేనేజ్మెంట్, టీం తో కలిసి పనిచేసే స్కిల్స్ మరియు ఫలితాలను సాధించడానికి బలమైన పట్టుదల.

ముంబై
రిలేషన్షిప్ మేనేజర్ - రిటైల్ లెండింగ్ - ముంబై
కావలసిన అనుభవం: 0-5
చదువు: PG - MBA/PGDM - ఫైనాన్స్, మార్కెటింగ్

ఉద్యోగ వివరణ

ఇందులో ఉండేవి రిటైల్ కస్టమర్లను కలుసుకొనుట మరియు మాట్లాడుట, వారి క్రెడిట్ విలువలను అంచనా వేయుట, వారి యొక్క ప్రత్యేకమైన అవసరాలను తెలుసుకొనుట మరియు సరైన పరిష్కారాలు ఇచ్చుట. ఇంకా ఇందులో ఉండేవి లోన్ ప్రాసెసింగ్, కౌన్సిలింగ్ ద్వారా నాణ్యమైన పోర్ట్ఫోలియో సృష్టించి మరియు పట్టి ఉంచుట, రిస్క్ మేనేజ్మెంట్, ప్రక్రియ మెరుగుదల, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా బయట మరియు అంతర్గత కస్టమర్ల నిబద్ధత తద్వారా హెచ్ డి ఎఫ్ సి కస్టమర్లకు విలువ జోడించడం. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ల నుండి బిజినెస్ మెరుగుపరుచుట, హెచ్ డి ఎఫ్ సి కు బిజినెస్ తెచ్చుటకు కార్పొరేట్ / డెవలపర్లతో కొత్త ఏర్పాట్లను ఏర్పాటు చేయడం.

 

 

కావలసిన అభ్యర్థి ప్రొఫైల్

అభ్యర్థి వివిధ ప్రోడక్ట్స్ గురించి వివరించుటకు గణనీయమైన సహనం కలిగి ఉండవలెను మరియు తన/ఆమె కు తెలిసిన జ్ఞానం బిజినెస్ అభివృద్ధికి సహాయపడవలెను. పైన వివరించిన స్థానానికి కావలసినవి అధిక శక్తి స్థాయిలు, సమగ్రత, కస్టమర్ కు సేవ చేయాలనే ధోరణి, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (నోటి మరియు వ్రాత), ఒప్పించే స్కిల్స్, ప్రక్రియ ధోరణి, టైం మేనేజ్మెంట్, టీం తో కలిసి పనిచేసే స్కిల్స్ మరియు ఫలితాలను సాధించడానికి బలమైన పట్టుదల.

సంభాషించుకుందాం!